ఈ నైపుణ్యం మీకు ఉంటే భారీగా డిమాండ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్‌ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్‌ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్‌ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది.