భారీ భూకంపం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇరాన్ దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్ దేశం హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో రిక్టర్ స్కేలుపై 6.4, 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపాల కారణంగా హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఒకరు చనిపోయారు.