ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పోలవరంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 120 కోట్ల జరిమానా ఎన్జీటీ విధించింది. దీనితో పాటు అనుమతి లేకుండా కట్టిన మరో మూడు ప్రాజెక్టులకు జరిమానా విధించింది. జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని ఏపీని ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ ఫిర్యాదులపై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.