షాపింగ్ వేలం పాటలో పంచాయితీకి భారీ ఆదాయం
1 min read– సంవత్సరానికి గాను 3కోట్ల 63 లక్షల 612 రూ.లు పంచాయితీకి భారీ ఆదాయం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు గ్రామపంచాయి తీలో పంచాయతీకి చెందిన 14 షాపులకు మంగళవారం ఉదయం గ్రామ సర్పంచ్ జయలక్ష్మమ్మ మరియు పంచాయతీ కార్యదర్శి సుధీర్ నందకుమార్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు.నిర్వహించిన వేలం పాటలో పంచాయతీకి భారీగా ఆదాయం వచ్చింది.14 షాపులకు గాను దక్కించుకున్న వారి వివరాలు సత్యనారాయణ,అక్బర్ బాష,శివకుమార్, మాబువలి,సురేష్ బాబు,జమాల్ బాష,చంద్రశేఖర్ నాయుడు,వేణుగోపాల్,కాశీ విశ్వనాథ్, రమణయ్య శెట్టి వెంకటేశ్వర్లు,అక్బర్ బాష,రాముడు, నాగభూషణం అను వీరు వేలం పాటలో షాపులను దక్కించుకున్నారని పంచాయతీ కార్యదర్శి సుధీర్ తెలిపారు.గత సంవత్సరం వేలం పాటలో ఒక నెలకు 26,011 రూపాయలు గ్రామపంచాయతీకి వచ్చిందని ఇప్పుడు పాడిన వేలంపాటలో ఒక నెలకు 30 వేల 301 రూపాయలు గ్రామ పంచాయతీకి పెరిగిందని అంతేకాకుండా ఇప్పుడు ఒక సంవత్సరానికి మొత్తం 3 కోట్ల 63 లక్షల 612 రూపాయలు పంచాయతీకి ఆదాయం భారీగా చేకూరిందని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో ఈఓఆర్డి ఫక్రుద్దీన్,తువ్వా చిన్న మల్లారెడ్డి,ఉపసర్పంచ్ తువ్వా లోకేశ్వర రెడ్డి,గ్రేడ్ 5 పంచాయితీ కార్యదర్శి కేశావతి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.