PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భోగాపురంలో భారీ జాతీయ పతాకావిష్కరణ..

1 min read

భారీ స్థూప ప్రాంగణ స్థలంలో 10 కోట్లు చెక్కు అందచేసిన భాస్కర్ కావూరు..

కన్నుల పండుగగా జాతీయ పతాక ఆవిష్కరణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు మెయిన్ బైపాస్ భోగాపురం వద్ద ఉన్న భారీ స్థూపం వద్ద జాతీయ పతాకాన్ని విజయవాడ నున్న శ్రీ సమరసత గంగానమ్మ గుడి పూజారి పెయ్యాల గురవయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా 10 కోట్ల రూపాయల చెక్కు,భారీపతాక స్థూపం ప్రాంగణ స్థలాన్ని ఆర్ ఎస్ఎస్ నాయకులకు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు అందచేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ తన కుమారుడు భాస్కర్ కావూరి 10 కోట్ల రూపాయలు నిధిని మంచి పనికి అందజేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో కొంత మంచి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. ఆయన తన ప్రసంగంలో కొంత ఉద్వేగంతో మాట్లాడుతూ తన అనుభవాలను, రాజకీయ అనుభవాలను, ప్రజాసేవను గుర్తుచేస్తూ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ సంచలక్ భరత్ జి మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్టతో భారతీయ సంస్కృతిక బంధం మరింత బలపడిందన్నారు. గీతం యూనివర్సిటీ అధినేత శ్రీ భరత్ మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేస్తూ, వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. భారీ జాతీయ పతాక స్తూపం వద్ద జరిగే వేడుకలకు సహకరిస్తున్న కావూరు సాంబశివరావు కార్యాలయ సిబ్బంది పులి శ్రీరాములు, రమేష్, చాట్ల రాజు, మూర్తి లను శ్రీ భరత్ సత్కరించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లు కొమ్మిరాజు, స్వయంభు వెలగలపూడి రామకృష్ణ, భూపతి రాజు ఆధ్వర్యంలో, తొలిత సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఇంచార్జ్ కట్నేని కృష్ణ ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన వివిధ పాఠశాలలకు, కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులకు ప్రతి ఒక్కరికి సహాపంక్తి విందును ఏర్పాటు చేశారు.

About Author