‘హరిహర వీరమల్లు’కు భారీ సెట్..!
1 min read
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం నిర్మాత ఎ.ఎం రత్నం భారీ ఎత్తున సెట్ ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఒరిజినల్ కొలతలతో చార్మినార్ సెట్‌ని నిర్మించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సెట్ ఏర్పాటు చేయడం.. ఇదే ప్రథమమని సినీ ప్రేమికులు చెబుతున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రకు అద్బుతంగా సూటయ్యాడన్నది పబ్లిక్ టాక్ . దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న వీరమల్లుకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఫిగర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈనెల 27వ తారీఖు నుంచి చార్మినార్ సెట్‌లో జరగబోతున్న దృశ్యాలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. 27వ తేదీ నుంచి వారం రోజులపాటు పవన్ కళ్యాణ్ మీద భారీ సన్నివేశాల చిత్రీకరణ జరగబోతోంది. ఈ రోజు నుంచే ప్రారంభమైన షూటింగ్‌లో ప్రత్యేకంగా ముంబై నుంచి వచ్చిన ఫైట్ మాస్టర్స్ నిర్దేశకత్వంలో వందల మంది పాల్గొనగా పైట్ చిత్రీకరణ జరగబోతోంది.