భారీగా తగ్గిన టూవీలర్ కొనుగోళ్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : సెమీ కండక్టర్ల కొరత, భారీగా పెరిగిన ముడిసరకు ధరలు ఆటోమొబైల్ రంగాన్ని కుంగదీస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొ త్తం మీద వాహన టోకు విక్రయాలు 6 శాతం మేర కు తగ్గాయి. ప్రధానంగా టూవీలర్ల రంగం పదేళ్లలో కనివిని ఎరుగని విధంగా దెబ్బ తింది. ఏడాది మొత్తం మీద టూవీలర్ హోల్‌సేల్ విక్రయాలు 1,34,66,412. గత ఏడాది ఈ సంఖ్య 1,51,20,783 ఉంది. అన్ని విభాగాల్లోనూ వాహన టోకు విక్రయాలు గత ఏడాదితో పోల్చితే 1,86,20,233 నుంచి 1,75,13.596 యూనిట్లకు తగ్గాయి. కమోడిటీ ధరలు ప్రత్యేకించి వాహనాల తయారీలో ఉపయోగించే మెటల్స్ ధర లు, రవాణా ధరలు గణనీయంగా పెరగడం సరఫరా వ్యవస్థ పైన, కంపెనీల లాభదాయకత పైన ఒత్తిడిని పెంచినట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.