NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీ ధ‌ర ప‌లికిన ఐపీఎల్ హక్కులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 2023-2027 కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలంలో టీవీ మరియు డిజిటల్ హక్కులను 44,075 కోట్ల రూపాయలకు రెండు బ్రాడ్‌‌కాస్టింగ్ సంస్థలు దక్కించుకున్నాయి. టీవీ ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. 410 మ్యాచ్‌లకు ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు తెలిసింది. టీవీ హక్కుల విలువ కంటే డిజిటల్ హక్కుల విలువ 10 శాతం తక్కువగా ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ రైట్స్ విలువ మాత్రం డే-1తో పోల్చుకుంటే పెరిగింది. తొలి రోజు ఈ-వేలంలో రూ.19,680 కోట్లు పలికితే రెండో రోజైన ఇవాళ రూ.20,500 కోట్లు పలికినట్లు తెలిసింది. టీవీ హక్కులు రూ.23,575 కోట్లు పలకగా, డిజిటల్ హక్కులు రూ.20,500 కోట్లు పలికినట్లు సమాచారం. మొత్తంగా 410 మ్యాచులకు గానూ డిజిటల్, టీవీ హక్కుల కోసం రూ.44,075 కోట్లు చెల్లించేందుకు బిడ్డర్లు ముందుకొచ్చినట్లు తెలిసింది. ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో డిజిటల్‌ రైట్స్‌‌ను Viacom 18 దక్కించుకున్నట్లు సమాచారం.

                                             

About Author