‘మానవత’ సేవలు అభినందనీయం: మేయర్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: మానవత మున్సిపల్ మహిళా కార్మికులకు ఆటల పోటీలు నిర్వహించడం ప్రశంసనీయం అని నగర మేయర్ డి వై రామయ్య అన్నారు. ఆదివారం నగరంలోని స్టేడియంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం అధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళ మున్సిపల్ కార్మికులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. మానవత మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి యాని ప్రతాప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేయర్ రామయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కొరకు పని చేస్తున్న మున్సిపల్ మహిళ కార్మికులకు ఆటవిడుపు ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ముఖ్య అతిధి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ మానవతా సంస్థ సేవలు సేవా పరంగానే కాక మహిళల అభివృద్ధికి, వారి మానసిక, శారీరక ఉల్లాసానికి ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించడం, అందులో పారిశుద్ధ్య మహిళ కార్మికులను ప్రత్యేకంగా గుర్తించడం గొప్ప విషయమన్నారు. మానవతా సంస్థకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి రేణుక మాట్లాడుతూ మహిళలు ఎందులోనూ తీసిపోరని గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు అన్ని రంగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక వేత్త టి. జి. శివరాజ్ తమ సంస్థ మున్సిపల్ కార్మికుల పిల్లలకు విద్య విషయం లో సహాయం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,మేయర్ రామయ్య,డిప్యూటీ మేయర్ రేణుక జెండా ఊపి పోటీలను ప్రారంభించడం జరిగింది. పోటీల అనంతరం డాక్టర్ వినీషా రెడ్డి, సెట్కూర్ సీఈవో రమణ, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ బాషా చేతుల మీదగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీమతి శ్వేతా రెడ్డి, ఏపీ ఐ డి సి డైరెక్టర్ పాటిల్ హనుమంత్ రెడ్డి, మానవతా కన్వీనర్ మనోహర్ రెడ్డి, అధ్యక్షులు శేషయ్య, ట్రెజరర్ అపర్ణ, ఉమాదేవి, దీపా, యుగంధర్, సుభద్రమ్మ, లక్ష్మి, సుబ్బమ్మ,శశి,శివా రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ,రంగారెడ్డి, యశోద రావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.