రాయపాటికి…అంతర్జాతీయ స్థాయి బెస్ట్ హ్యుమానిటీ సర్వీసెస్ పురస్కారం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీలంక దేశానికి చెందిన వన్ నేషన్స్ చిల్డ్రన్స్ ట్రస్ట్ అంతర్జాతీయ సంస్థ ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా సేవారంగంలో విస్తృత సేవలు అందిస్తున్న సంస్థలకు అంతర్జాతీయ పరిష్కారాలలో భాగంగా 2023 -2014 సంవత్సరానికి గాను నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఇంటర్నేషనల్ గుడ్ విల్ అంబాసిడర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు నేడు అంతర్జాలం ద్వారా జరిగిన సమావేశంలో ఆ సంస్థ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ అంబాసిడర్ ఎం .ప్రతాప్ చందరం చే అందుకున్నారు.గత 33 సంవత్సరాలుగా వృత్తి విద్యలపై శిక్షణ ,మహిళలకు నైపుణ్య విద్యలపై శిక్షణ నిర్వహించడం ,సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, యువత పరిశ్రమల నిర్వహణ పై అవగాహన సదస్సులను నిర్వహించడం ,వికలాంగుల కు మెరిట్ స్కాలర్షిప్స్ ను ఇవ్వడంతో పాటు వృత్తివిద్యాలపై నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణ కొరకై చెట్లు నాటడం, వాతావరణ కాలుష్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం , రోడ్డు పక్కన నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం,మహిళా వృద్ధులకు చీరల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం మరింత సామాజిక బాధ్యతను పెంచిందని మున్ముందు నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇతర జాతీయ ,అంతర్జాతీయ సేవా సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నామని తెలిపారు.