హుండీ ఆదాయం 35.89 లక్షల
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : మహానంది ఆలయానికి సంబంధించి హుండీ లెక్కింపు ద్వారా 35.89 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 43 రోజుల్లో క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు వేసిన కానుకల్లో భాగంగా హుండీల ద్వారా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దీంతోపాటు 20 గ్రాముల బంగారు ఆభరణం కూడా వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున ,వెంకటేశ్వర్లు , వీరభద్రుడు ఏఈఓ మధు సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ఇతర ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.