హుండీ ఆదాయం..రూ.52.32 లక్షల
1 min read
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె: మండలంలోని నందవరం శ్రీ చౌడేశ్వరీ మాత ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా 52,32,494 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీఎల్ఎన్ రామానుజన్ బుధవారం తెలిపారు.ఆలయ ఆవరణంలో బుధవారం ఉదయము హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి హరీష్ చంద్రారెడ్డి మరియు నందివర్గం పోలీసుల సమక్షంలో నిర్వహించినట్లు తెలిపారు. నంద్యాలకు చెందిన యాడికి శ్రీదేవి బృందానికి చెందిన 120 మంది మహిళలు హుండీ లెక్కింపుకు సహకరించినట్లు తెలిపారు.మే 1వ తేదీ నుండి ఇప్పటివరకు సుమారు 6 నెలల కాలానికి ఈ ఆదాయం హుండీ ద్వారా లభించినట్లు ఈవో రామానుజన్ తెలియజేశారు.