NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూరు శాతం ఖాళీలను భర్తీ చేయాలి..

1 min read

– పి అర్ టి యు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు
పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేసిన అన్ని పోస్టులను 100 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని కడప,పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మార్తాల వెంకట కృష్ణారెడ్డికి PRTU AP రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు వినతిపత్రం సమర్పించారు. సోమవారం ఉదయం ఆయన కార్యాలయంలో కలిసిన సందర్భముగా వారు విన్నవిస్తూ SGTలు ఒక కేటగిరీ సబ్జెక్టులో ఒక సారి పదోన్నతిని నిరాకరించిన వారికి ఒక సంవత్సరం వరకూ ఏ సబ్జెక్టు యందు కూడా పదోన్నతి అవకాశము ఉండదని పాఠశాల విద్యా కమీషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరారు. ఉపాధ్యాయులకు పదోన్నతిని నిరాకరించిన సబ్జెక్టు కాకుండా అదే కేటగిరీలోని మరొక సబ్జెక్టుకు పదోన్నతులు పొందుటకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తూ ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి నిరాకరించిన వారికి ఎంఈఓ పదోన్నతులకు అవకాశం కల్పించాలని వారు కోరారు. బదిలీల G.O విడుదలైన తర్వాత దానిలో Long standing 5 ఏళ్ళా? 8 ఏళ్ళా?అని స్పష్టమైతే పదోన్నతికి Willing ఇవ్వలో, వద్దో ఉపాధ్యాయులు నిర్ణయించుకుంటారని కావున దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో PRTUAP రాష్ట్ర కార్యదర్శి , పాఠ్యపుస్తక రచయిత మడితాటి నరసింహరెడ్డి, అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు బడిశెట్టి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author