జలియన్ వాలాభాగ్ మారణకాండకు వందేళ్లు
1 min readపల్లెవెలుగు వెబ్: 1919 ఏప్రిల్ 13, వైశాఖి పర్వదినం. 102 సంవత్సరాల క్రితం. భారత స్వాతంత్రోద్యమంలో అదొక మారణకాండ
పంజాబ్ లోని అమృత్సర్ నగరం స్వర్ణ దేవాలయానికి సమీపంలో జలియన్ వాలాబాగ్ ఉన్నది. ఇది ఒక తోట మూడు వైపులా ఎత్తైన గోడలు, భవనాలు ఇళ్ళు ఉన్నాయి. నాలుగో వైపు ఒక చిన్న ఇరుకైన దారి మాత్రమే. అందులో ఆ రోజు,మహిళలు, పిల్లలతో సహా 10 వేలమంది గుమిగూడారు. అక్కడ ఉత్సవం జరుపుకోవడానికి నగరంలోని ప్రజలు సమీప ప్రాంతాల వారు కూడా చేరుకున్నారు. కొద్దిరోజుల ముందు పంజాబ్ స్వతంత్ర పోరాట నాయకులు సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు ప్రభుత్వ నిర్బంధానికి గురయ్యారు. ఇరువురు గొప్ప త్యాగజీవులు స్వతంత్రం కోసం పోరాడుతున్న వారు.
ఆ తోటలో కలుసుకున్నది.. వైశాఖీ ఉత్సవం జరుపుకోవడానికి అయినా నాయకుల నిర్బంధం పై, ఉపన్యసించడానికి, మరికొందరు రాష్ట్ర నాయకత్వం వస్తున్నారు. ప్రజలంతా వినడం కోసం వేచి ఉన్నారు. దేశమంతటా..పంజాబ్ అంతటా జాతీయోద్యమం. ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
విచక్షణ రహితంగా కాల్పులు : సుమారు 90 మంది పోలీసులతో బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ తోటలో ప్రవేశించాడు. హెచ్చరిక కూడా చేయకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆఖరి తూటా అయిపోయేంత వరకు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించు కోవడానికి ఎటువంటి దారి లేదు, కాల్పుల అనంతరం శవాలను గాయపడినవారిని కనీసం పట్టించుకోకుండా సాయుధ పోలీసులు వెళ్ళిపోయారు. వెంటనే కర్ఫ్యూ ప్రకటించారు.
అన్ని వీధులూ ..కర్ఫ్యూ : పన్నెండు వందల మంది చనిపోయారు 126 మంది, తప్పించుకునే ప్రయత్నంలో నూతిలో పడి చనిపోయారు. కొన్ని వందలమంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కానీ అన్ని వీధులు కర్ఫ్యూ ,సైన్యంతో నిండి పోయాయి. ఈ ఘటనతో దేశ మంతటా ఆగ్రహంతో రగిలి పోయింది. పంజాబ్ ఎలా ఉంటుందో ఊహించుకో వలసిందే. కేవలం కొద్ది వారాల ముందుగానే దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం చేరిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జాతీయోద్యమ లోనికి ప్రవేశించారు. ఆ తదనంతరం 1920 నుండి 22 వరకు,సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా జలియన్ వాలా బాగ్ ఉదంతమే ఒక ప్రేరణ. అక్కడితో ముగిసిపోలేదు.
ఉద్దం సింగ్ పోరాటం : ఉద్ధం సింగ్ యువకుడు. ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలని కొన్నాడు. కష్టపడి లండన్ ప్రయాణమయ్యాడు జలియన్వాలాబాగ్ దారుణ మారణకాండకు బాధ్యుడైన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డైయర్, లండన్ లో నివాసముంటున్నాడు. డయ్యర్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి చాలకష్ట పడాల్సి వచ్చింది. 1940 లో నడి రోడ్డుపై బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగానే డయ్యర్ ను కాల్చిచంపాడు. జలియన్వాలా బాగ్ దురంతానికి, ప్రతీకారంగా ఈ కాల్పులు జరిపానని ధైర్యంగా ప్రకటించాడు. తప్పించుకు పారిపోవడానికి అవకాశం ఉన్నా పారిపోలేదు. అనంతరం బ్రిటిష్ పోలీసులు ఆయన్ను ఉరితీశారు. జలియన్వాలా బాగ్ దురాగతం రగిల్చిన చైతన్యంతో ఆ తర్వాత 28 సంవత్సరాలకి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది.