PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

28న మీ జీ తెలుగులో…  హంగామా..

1 min read

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్తో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదంఅందించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతోకలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీవేదికను అందిస్తోంది జీ తెలుగు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ భగవంత్కేసరి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మరియు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగాసూపర్ జోడిప్రారంభం, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, జీతెలుగులో మాత్రమే!సక్సెస్ఫుల్ నాన్ఫిక్షన్ షోలతో అలరించిన జీ తెలుగు ఈఆదివారం సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడిని ప్రారంభిస్తోంది. జీతెలుగులో జనవరి 28న టాలీవుడ్హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా ప్రారంభం కానున్న సూపర్ జోడీ ప్రతిఆదివారం రాత్రి 9గంటలకు ప్రసారం కానుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయ భాను జీతెలుగు సూపర్ జోడి షోతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎవర్గ్రీన్నటి మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘుమాస్టర్, హీరోయిన్శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు. ప్రేక్షకులను మెప్పించి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచినభగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగు అందిస్తోంది. అనిల్రావిపూడి దర్శకత్వంలో రూపొందినఈ సినిమా కథ జైలు నుండి విడుదలైన మాజీ పోలీస్అధికారి నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలోనందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలప్రధానపాత్రల్లో నటించగా అర్జుల్ రాంపాల్, పి.రవిశంకర్, ఆర్. శరత్ కుమార్, రఘుబాబుఇతర కీలకపాత్రల్లో నటించారు. యాక్షన్, ఎమోషన్స్,కెమిస్ట్రీ అన్నింటి మేళవింపుగా సాగిన భగవంత్ కేసరి సినిమా వరల్డ్ టెలివిజన్ప్రీమియర్గా మీ జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రసారంకానుంది. ఈ సందర్భంగా జీ తెలుగు ‘బనావో బేటీకో షేర్’ కాంటెస్ట్నినిర్వహించనుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు సర్ప్రైజ్ గిఫ్ట్ని పొందుతారు. భగవంత్ కేసరిసినిమా చూడండి.. మీరు కూడా ఈ పోటీలో పాల్గొనండి, మీజీ తెలుగులో!

About Author