PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యాయత్నం

1 min read

పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి: మండలంలోని చిన్నవంగలి గ్రామానికి చెందిన బాల సంజమ్మ అనే మహిళ భర్త చంద్రఓబులరెడ్డి వేధింపులు తాళలేక విద్యుత్‌ తీగలు పట్టుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది . ఈ ఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు… గ్రామానికి చెందిన బాలసంజమ్మ భర్త నిత్యం అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులు తాళలేక గ్రామ సమీపంలోని పొలంలోని ట్రాన్స్‌పారం వద్ద విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. తీవ్రంగా గాయపడ్డ బాలసంజమ్మను స్థానికులు చాగలమర్రి పట్టణం లోని కేరళ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మారుతి వివరించారు.

About Author