వివాహిత హత్య కేసులో..భర్త, అత్త అరెస్ట్
1 min read
వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి శేషాశయానా రెడ్డి నగర్ లో మొల్ల నజీమున్ (21)ను హత్య చేసిన కేసులో భర్త మొల్ల అబ్దుల్లా,అత్త మొల్ల రఫీయాభీ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నందికొట్కూరు పట్టణ సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు.సీఐ తెలిపిన వివరాల మేరకు మృతురాలి భర్త స్వగ్రామం గడివేముల మండలం మంచాల కట్ట గ్రామం అయితే గత మూడు సంవత్సరాలుగా నందికొట్కూరు పట్టణంలో నివాసం ఉంటున్నారని అన్నారు.పట్టణంలోని బాడుగకు ఉంటున్న ఇంటిలో శుక్రవారం సాయంత్రం ఈల కత్తి మరియు కర్రతో నజీమూన్ తలపై మరియు శరీరంపై విపరీతంగా కొట్టడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.అదే రోజున మృతురాలి తండ్రి పఠాన్ అలీ భాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త అత్త పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళ వారం మ 12 గంటల సమయంలో నిందితులు అయిన భర్త, అతను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.అదే విధంగా హత్యకు ఉపయోగించిన ఈల కత్తి మరియు కట్టెను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.