తువ్వాలు ఇవ్వలేదని.. భార్యను హత్య చేసిన భర్త !
1 min readపల్లెవెలుగు వెబ్:మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా హీరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదన్న కోపంతో భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. నిందితుడు అటవీ శాఖలో పనిచేస్తున్న రాజ్ కుమార్ బాహేగా పోలీసులు గుర్తించారు. స్నానం ముగించుకున్న రాజ్ కుమార్ భార్య పుష్పా బాయ్ ను తువ్వాలు అడిగాడు. ప్రస్తుతం పనిలో ఉన్నానని కాసేపు ఆగాలని ఆమె చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత తువ్వాలు ఇచ్చింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న రాజ్ కుమార్ అక్కడే ఉన్న భార్య తలపై పారతో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది.