NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార్యను మేక‌ప్ లేకుండా చూసిన భ‌ర్త.. విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్ బుక్ లో ప‌రిచ‌యం ఏర్పడింది. ఇద్దరూ ఫేస్ బుక్ లో గంట‌ల‌పాటు చాటింగ్ చేసుకున్నారు. ప్రొఫైల్ పిక్ లో ఆమె ఫోటో చూసి అత‌ను మంత్రముగ్ధుడ‌య్యాడు. ఆమెను నేరుగా క‌లిసేందుకు ఆరాట‌ప‌డ్డాడు. ఆమెతో ప‌లుమార్లు డేటింగ్ కు కూడ వెళ్లాడు. ఆమెను ఒప్పించి ఆమెతో ఏడడుగులు న‌డిచాడు. ఇదంతా బాగానే జ‌రిగింది. కానీ పెళ్లయిన మ‌రుస‌టి రోజే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆమెను మేక‌ప్ లేకుండా చూసే స‌రికి అత‌ను ఖంగుతిన్నాడు. పెళ్లికి ముందు చూసిన వ్యక్తి ఆమేనా ? అంటూ ఆశ్చర్యపోయాడు. మేక‌ప్ లేకుండా కూడా భార్య అందంగా క‌నిపిస్తుందేమోనని వెయిట్ చేశాడు. నెల‌రోజులు గ‌డిచినా ఎలాంటి మార్పు లేక‌పోయేస‌రికి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు.

About Author