భర్త ఆదాయం కచ్చితంగా భార్యకు చెప్పాలట !
1 min read
పల్లెవెలుగువెబ్: మగవాళ్ల సంపాదన, ఆడవాళ్ల వయస్సు అడగకూడదంటుంటారు.. దీనికి తగ్గట్లే కొంతమంది మగవాళ్లు సంపాదన విషయాలు ఇంట్లో వాళ్లతో పంచుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో పెద్దగా సమస్యలు కూడా ఉండవు. కానీ వివాహ బంధంలో పొసగక విడాకుల వరకూ వెళ్లే దంపతుల విషయంలో మాత్రం ఆదాయ వివరాలే సమస్యగా మారతాయి. కానీ ఇప్పుడు అలా కుదరదు. భర్త ఆదాయాన్ని భార్య సమాచార హక్కు చట్టం కింద తెలుసుకోవచ్చు. సంజు గుప్త అనే మహిళ కేసులో కేంద్ర సమాచార కమిషన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.