భర్త ఆస్తిపై భార్యకు హక్కులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు !
1 min readపల్లెవెలుగువెబ్ : భర్త ఆస్తి పై భార్య హక్కుల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లు చేసి.. తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడన వీలునామా రాసిన పక్షలో .. ఆ ఆస్తి పై ఆమెకు సంపూర్ణ హక్కులు ఉండవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హర్యాణకు చెందిన తులసీరామ్ మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య రామ్ దేవి కుమారుడి పేరున 1968లో వీలునామా రాశారు. తన ఆస్తిని ఆమె జీవిత కాలమంతా అనుభవిస్తూ.. దాని ద్వార వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం యావత్ ఆస్తి తన కుమారుడికే దక్కాలంటూ వీలునామాలో పేర్కొన్నాడు. తులసీరామ్ 1969లో మరణించాడు. కొందరు వ్యక్తులు రామ్ దేవి నుంచి ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రామ్ దేవి నుంచి ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్ డీడ్ లను కొనసాగించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.