PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ విమానం.. పాకిస్థాన్లో దిగింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. ‘షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.’ అని ఇండిగో ప్రకటనలో తెలిపింది.

                                   

About Author