2024 వరకు హైదరాబాదే రాజధాని.. బొత్స కీలక వ్యాఖ్యలు !
1 min readపల్లెవెలుగువెబ్ : పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ, ఢిల్లీలో కూడా చర్చకు దారితీశాయి. ‘2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే’ అని బొత్స వ్యాఖ్యానించారు. అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యకలపాలు సాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో బొత్స చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.