NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16 వార్డుల్లో… హైపో ద్రావణం ..

1 min read
వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే , మేయర్​

వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే , మేయర్​

– వాహనాలను ప్రారంభించిన మేయర్​ రామయ్య

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్​ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వార్డుల్లో హైపో ద్రావణం పిచికారి చేయాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి, మేయర్​ రఘురామయ్య అధికారులను ఆదేశించారు. పాణ్యం నియోజకవర్గం, కల్లూరు అర్బన్​ పరిధిలోని 16 వార్డుల్లో హైపో ద్రావణం పిచికారి చేసేందుకు శనివారం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డితో కలిసి మేయర్​ రామయ్య, డిప్యూటీ మేయర్​ సిద్ధారెడ్డి రేణుక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బాధ్యతయుతంగా ప్రవర్తించాలని, మాస్క్​ ధరిస్తూ… ఇంటికే పరిమితం కావాలని , భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు, దండు లక్ష్మీకాంత్ రెడ్డి, మైతాపు నరసింహులు, ఎరుకల వెంకటేశ్వర్లు, సాపూరు మాధురి, నారాయణరెడ్డి, పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author