NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీరు నీతులు చెబితే వినే స్థితిలో లేం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పాకిస్థాన్ విధానాల పై భార‌త్ మ‌రోసారి తీవ్రస్వరంతో మండిప‌డింది. ఐక్యరాజ్య స‌మితి వేదిక‌గా విమ‌ర్శల బాణాలు సంధించింది. పాకిస్థాన్ ను ఒక విఫ‌ల దేశంగా అభివ‌ర్ణించింది. నిత్యం ఉగ్రవాదుల‌కు అండ‌గా ఉంటూ.. మాన‌వ హ‌క్కుల‌ను కాల‌రాసే పాక్ నుంచి నీతి పాఠాలు చెప్పించుకునే స్థితిలో లేమ‌ని భార‌త్ గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది. క‌శ్మీర్ విష‌యాన్ని ప్రస్తావించినందుకు గానూ పాక్, ఐఓసి సంస్థల తీరును ఎండ‌గ‌ట్టింది. మాన‌వ హ‌క్కుల వేదిక‌ల‌పై భార‌త్ పై దుష్రచారానికి పాల్పడ‌టం పాక్ కు అల‌వాటేన‌ని తెలిపింది. త‌న వైఫల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు పాక్ ఈ త‌ర‌హా ప్రచారం చేస్తుంద‌ని భారత్​ తేల్చి చెప్పింది. పాక్ లో ఏ ఒక్క మైనార్టీ వ‌ర్గమూ సంతోషంగా లేద‌ని, నిత్యం హింస‌కు గుర‌వుతున్నార‌ని భార‌త్ చెప్పింది.

About Author