నేను ఎన్టీఆర్ కు పోటీ కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : తనకు జూనియర్ ఎన్టీఆర్ తో ఎలాంటి పోటీ లేదని నందమూరి తారకరత్న అన్నారు. తాను కెరీర్ ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్‌కి పోటీగా తారకరత్న సినిమాల్లోకి వచ్చారని అంతా చెప్పుకొన్నారని అన్నారు. ఆ మాటల్లో నిజం లేదని చెప్పారు. “ఎన్టీఆర్ 2001లో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాతే నేను హీరోగా వచ్చా. నేను ఎప్పుడూ తారక్‌కి పోటీ అనుకోలేదు. ఆ రోజు నుంచి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. సరైన సందర్భం కుదరలేదు. మేమంతా నందమూరి బిడ్డలమే. ఇప్పటికీ మా కుటుంబ పేరు అభిమానుల్లో నిలబడి ఉందంటే దానికి తారక్ ఒక కారణం’’ అని నందమూరి తారకరత్న అన్నారు.