నా కూతురు జోలికొస్తే సహించేది లేదు : అభిషేక్ బచ్చన్
1 min readపల్లెవెలుగు వెబ్ :సోషల్ మీడియాలో తన కూతురి పై చేస్తున్న ట్రోల్స్ పై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరాధ్య నడక వంకరగా ఉందంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ పై ఆయన మండిపడ్డారు. తాను పబ్లిక్ ఫిగర్ అని, తనని ఎంతైనా ట్రోల్ చేయండి కానీ.. తన కూతరుని అనడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. దమ్ముంటే తన ముందు ఆ మాటలు అనండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఇక నుంచి అలా అంటే సహించేది లేదన్నారు. తన తదుపరి చిత్రం `బాబ్ బిశ్వాస్` చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.