NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ మూడు హ‌త్య‌లు నేనే చేశా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ‌లోని సైకో కిల్లర్‌ రాంబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అపార్ట్‌మెంట్లలో పనిచేసే వాచ్‌మెన్‌ కుటంబాలనే హత్యలు చేయాలనే టార్గెట్‌ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సైకో కిల్లర్‌ రాంబాబు ఇప్పటికి మూడు హత్యలు చేశాడు. నిందితుడు నర్సీపట్నానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు. శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లను లక్ష్య్గంగా చేసుకుని అర్ధరాత్రి సమయంలో ఈ హత్యలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెల్లార్‌లో ఎటువంటి భద్రత లేని వాచ్‌మన్‌ కుటుంబాలను టార్గెట్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ అనుమానితుడిని నర్సీపట్నం సమీప బొడ్డేపల్లి శివారు వీరవాసరం గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. అతను కొంతకాలం కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉండేవాడని, అతడి ప్రవర్తన నచ్చక భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో ఉన్మాదిగా మారి, పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పెందుర్తి వచ్చాడని చెబుతున్నారు.

                                          

About Author