PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొడాలి నాని ఎవ‌రో తెలియ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్న ద‌ర్శ‌కుడు ఆర్జీవీ మ‌రోసారి త‌న‌దైన శైలిలో స్పందించారు. ఆర్జీవీ ప్ర‌శ్న‌ల‌కు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంట‌ర్ ఇచ్చారు. దీని పై స్పందించ‌మ‌ని కోర‌గా.. కొడాలి నాని ఎవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ ఆర్జీవీ స‌మాధానం ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో నేచురల్‌ స్టార్‌ నాని ఒక్కడే. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’’ అని ఆర్జీవీ అన్నారు.

                                               

About Author