ఎమ్మెల్సీ అశోక్ బాబును ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. అశోక్‌బాబు అరెస్టును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. జగన్ రెడ్డి డైరెక్ట్‌గా జైలుకు వెళ్లారు.. కాబట్టి ఏమీ తెలియదన్నారు. అశోక్‌బాబు తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి తెలిసిన వారితో పిటిషన్ వేయించి సీఐడీతో అశోక్‌బాబును అరెస్ట్ చేయించారని విమర్శించారు. అర్ధరాత్రి అరెస్ట్ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. సీఎం జగన్‌కు.. సీఐడీకి ఉన్న బంధం ఏంటో తెలియదన్నారు. అశోక్‌బాబును అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని రఘురామ అన్నారు.