PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీర జవాన్లను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్న..

1 min read

– కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ

వీర జవాన్లు, అమరవీరులైన వారి కుటుంబాలకి సత్కారం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  మేరీ మాట మేరా దేశ్.భారత భూమి పరాక్రమాన్ని, ఈ నేల యొక్క స్వేచ్ఛ మరియు పురోగతిని తెలియజేసే కార్యక్రమం అన్నారు కల్నల్ ఆలోకరాయ్. స్థానిక సెయింట్ థెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో 19 ఆంధ్ర బెటాలియన్ కి చెందిన ఎన్ సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అలోక్ రాయి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ జవాన్లను గౌరవించడం ద్వారా భారతదేశపు ప్రతిష్టాత్మకమైన వారసత్వాన్ని రక్షించడానికి భావితరాలకు స్ఫూర్తిదాయ కమన్నారు.మిట్టి కొనమన్ వీరోం కా వందన్ కార్యక్రమంలో భాగంగా నేడు వీర జవాన్లను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ దేశ రక్షణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వాతంత్ర్య సమరయోధులు రక్షణ సిబ్బంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీరులను ఈ సందర్భంగా సత్కరించడం మన దేశభక్తికి నిదర్శనమని తెలియజేశారు.కళాశాల హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమాన్ని గురించి సభకు పరిచయం చేస్తూ… భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవం ముగింపు కార్యక్రమం మేరీ మాటే మేరా దేశ్ అన్నారు. అత్యున్నత త్యాగం చేసిన వీర, వీరాంగులకు నివాళి. దీనిలో భాగంగా శిలాఫలకం ఏర్పాటు, పంచ ప్రాణ ప్రతిజ్ఞ, వసుధ వందన్, వీరోం కా వందన్, రాష్ట్ర గాన్ అమృత కలశ యాత్ర మొదలైనవి చేయాలని నిర్ణయించారని తెలియచేశారు.ఎన్ సి సి ఆఫీసర్లు మరియు క్యాడెట్లు నేడు వీరోం కా వందన్ కార్యక్రమంలో భాగంగా కార్గిల్ లాంటి యుద్ధాల్లో భాగస్తులైన ఏడుగురు వీర జవాన్లను, ఇద్దరు అమరవీరులైన జవాన్ల కుటుంబాలను సత్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. రిటైర్డ్ ఆనరరీ లెఫ్ట్నెంట్ యూఎస్ వర్మ, రిటైర్డ్ వారెంట్ ఆఫీసర్ పి సుబ్బారావు, రిటైర్డ్ సుబేదార్ ఐ శ్రీనివాసరావు, రిటైర్డ్ సుబేదార్ ఎం జాన్ పటేల్, టైర్డ్ సుబేదార్ టి ఎల్ శ్రీనివాసరావు, రిటైర్డ్ నాయక్ డి శ్రీనివాసరావు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్ గేహరీ రవి కిరణ్, అమర వీర జవాన్ జాన్ సుందర్రావు సతీమణి శ్రీమతి ఆర్ శాంతకుమారి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన అమర వీర జవాన్ కే సతీష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి కే హరిదేవిలను సన్మానించారు.కార్యక్రమాన్ని సెయింట్ థెరెసా కళాశాల వ్యాయామధ్యాపకురాలు మరియు 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్ సి సి ఆఫీసర్ మేజర్ డాక్టర్ సెలీన్ రోస్, సి ఆర్ ఆర్ కళాశాలకు చెందిన నవీన్ కుమార్, కే పి డి టి హై స్కూల్ కు చెందిన, సెకండ్ ఆఫీసర్ ఎస్ రామయ్య, ఏలూరు మున్సిపల్ స్కూల్ కి చెందిన సెకండ్ ఆఫీసర్ బి లాజర్, ఎఈఎస్ డి ఎం హై స్కూలు ఏలూరుకు చెందిన థర్డ్ ఆఫీసర్ టి. ప్రకాష్ రావు, సర్ సి ఆర్ ఆర్ పబ్లిక్ స్కూల్ కు చెందిన సెకండ్ ఆఫీసర్ ఎన్ అనంతరాజ్య లక్ష్మి, డి పాల్ కాలేజీకి చెందిన మిస్టర్ తంబి, సి ఆర్ ఆర్ పబ్లిక్ స్కూల్ కి చెందిన మిసెస్ రమ, మరియు ఎన్ సిసి క్యాడెట్లు, కార్యక్రమాన్ని నిర్వహించారు.

About Author