PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా వ‌ద్ద కావాల్సినంత డ‌బ్బు ఉంది : ఆర్.నారాయ‌ణ‌మూర్తి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆర్. నారాయ‌ణ మూర్తి చాలా దీన‌స్థితిలో ఉన్నారంటూ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తల‌ను ఆర్. నారాయ‌ణ‌మూర్తి ఖండించారు. త‌న వ‌ద్ద డ‌బ్బు ఉంద‌ని, సంతోషంగా ఉంద‌ని చెప్పారు. అప్పులు చేసి సినిమాలు తీయ‌డం.. త‌ర్వాత తీర్చడం సాధార‌ణ‌మ‌ని అన్నారు. త‌నకు కోటానుకోట్ల డ‌బ్బు ఇస్తున్నార‌ని, అంత‌కంటే ఎక్కువైన ప్రేక్షకుల అభిమానం, ఆద‌ర‌ణ ఉన్నాయ‌ని తెలిపారు. త‌న‌కు ఏదైన అవ‌స‌రం వ‌స్తే ఇండ‌స్ట్రీ పెద్దలు స‌హాయం చేస్తార‌ని అన్నారు. త‌న పై అవాస్తవాలు ప్రచారం చేయ‌డం ధ‌ర్మం కాద‌ని అన్నారు. సోష‌ల్ మీడియాలో స‌త్యాన్ని చాటిచెప్పండంటూ కోరారు. త‌న అభిమానులు త‌న‌కు ఫోన్ చేసి.. డ‌బ్బు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని.. వారంద‌రికీ కృత‌జ్ఞతలు తెలిపారు. వారి అభిమానానికి ధ‌న్యవాదాలు తెలిపారు. కానీ ఇలాంటి ప్రచారం త‌న‌ను ఎంతో బాధ‌కు గురిచేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

About Author