PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాకు ల‌క్ష‌లాది మంది గాడ్ ఫాద‌ర్ లు ఉన్నారు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అనంత‌పురంలో జ‌రిగిన `గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చాలా ఉత్సాహంతో .. ఉద్వేగంతో కనిపించారు. ఒక వైపున జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఆయన హుషారుగా ప్రసంగించారు. మీరంతా నన్ను ‘గాడ్ ఫాదర్ ‘ అంటున్నారు. ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన నాకు, ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి అభిమాని నాకు గాడ్ ఫాదర్ అంటూ గట్టిగా అరిచారు. ఈ ఒక్క మాటకి జనం నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవికి వెనుక ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేరని అంటుంటారు. ఇప్పుడు చెబుతున్నాను .. నా వెనుక లక్షలాదిమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు” అంటూ చిరంజీవి అభిమానులను మరింత హూషారెత్తించారు.

                                           

About Author