నా తల్లిదండ్రుల శ్రమ వల్లే సివిల్స్ సాధించా…
1 min read
సివిల్స్ లో సత్తా చాటిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డి
చెన్నూరు, న్యూస్ నేడు : చెన్నూరు బ్యాంకు కాలనీకి చెందిన నేలటూరు వెంకటసుబ్బారెడ్డి( చంటి) నేలటూరు సావిత్రమ్మ కుమారుడు నేలటూరు శ్రీకాంత్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్( సివిల్స్ ఫలితాల్లో ల 151 వ ర్యాంకు సాధించారు. ఈయన మొదటి ,రెండవ ప్రయత్నంలో ప్రిలిమినరీ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కాలేకపోయారని,అయితే తాజా ఫలితాలలో ఆయన సివిల్స్ లో 151 వ ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. నేలటూరి శ్రీకాంత్ రెడ్డి 8వతరగతి నుండి, పదవ తరగతి వరకు కడప, భాష్యం పాఠశాల, నాగార్జున పాఠశాలలో చదివారు, నెల్లూరు నరసింహకొండ కాలేజీలో ఇంటర్ వరకు చదివి, బీటెక్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విండోర్ ఐఐటి కాలేజీలో 2019లో పూర్తి చేయడం జరిగింది. అనంతరం 2020- 2021 వ సంవత్సరం లో హైదరాబాద్ ఎల్ఐసి కంపెనీలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తూ 2022- 2023 లో బెంగళూరులోని ఇన్సైడ్ కోచింగ్ సెంటర్ లో సోషియాలజీ సబ్జెక్ట్ ద్వారా మొదటి రెండవ ప్రయత్నాలలో ప్రిలిమినరీ మెయిన్స్ వరకు వెళ్లి అక్కడ ఎంపిక కాలేకపోయారు.2023 24 సంవత్సరం మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా సివిల్స్ ఫలితాల్లో 151 ర్యాంకు సాధించ అడ్డం జరిగిందని తెలిపారు.
నాతల్లిదండ్రుల శ్రమతోటే నేను కష్టపడి చదివా… నేలటూరి శ్రీకాంత్ రెడ్డి..
నా తల్లిదండ్రులు నేలటూరు వెంకటసుబ్బారెడ్డి (చంటి) సావిత్రమ్మ లు రైతులని వారు ఎంతో కష్టపడి నన్ను చదివించారని తెలిపారు. వారు నా చదువుకి ఎంతో ప్రోత్సహించారని నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆ ఆశలు అడియాసలు కాకుండా, ఎంతో కష్టపడి, ఇష్టపడి చదవడం జరిగిందన్నారు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, సివిల్స్ పై మక్కువతో ఉద్యోగాన్ని వదిలి బెంగళూరులో కోచింగ్ తీసుకోవడం జరిగిందన్నారు. ఒకటి రెండు తప్పినప్పటికీ పట్టు వదలక మరింత కసితో చదవడంతో ఈసారి గురి తప్పలేదని 151 వ ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. ఇదంతా నా తల్లిదండ్రుల శ్రమకు ఫలితమే నని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.పట్టుదలతో చదివి సివిల్స్ లో 151 వ ర్యాంక్ సాధించాడు.. తమ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ప్రతి తరగతిలో మెరుగ్గా చదివారని, అతనికి చదువు పట్ల ఉన్న శ్రద్ధను గమనించి ఉన్నత చదువులకు ప్రోత్సహించడం జరిగిందన్నారు. శ్రీకాంత్ రెడ్డి కచ్చితంగా ఏదైనా పెద్ద ఉద్యోగం సాధిస్తాడనే నమ్మకం మాలో మరింత బలపడిందని ఆ మేరకు ఆయనను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడం జరిగిందన్నారు. శ్రీకాంత్ రెడ్డి మా నమ్మకాన్ని నిల పెట్టడమే కాకుండా చెన్నూరు మండలానికి కూడా పేరు తీసుకురావడం జరిగిందని వారు ఆనందభాష్వాలతో తెలపడం తెలపడం జరిగింది..శ్రీకాంత్ తల్లిదండ్రులు నేలటూరి వెంకటసుబ్బారెడ్డి, సావిత్రమ్మ.