NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా సినిమాలు ఉచితంగా వేసి చూపిస్తా : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిపడ్డారు. త‌న సినిమాలు ఆపేసి.. త‌న ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాల‌ని చూశార‌ని అన్నారు. త‌న సినిమాలు ఆపేసినా భ‌య‌ప‌డ‌న‌ని, పంతానికి వ‌స్తే త‌న సినిమాలు ఉచితంగా వేసి చూపిస్తాన‌ని అన్నారు. సినిమా టికెట్లకు పార‌ద‌ర్శక‌త లేదంటున్నారు.. మ‌రి  మ‌ద్యానికి పార‌ద‌ర్శక‌త ఉందా ? అంటూ ప్రశ్నించారు. వైకాపా దౌర్జన్యాలు ఎండ‌గ‌ట్టాల‌ని అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా ? .. క‌నీసం శిలాఫ‌ల‌క‌మైనా వేశారా ? అంటూ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల‌కు మ‌ద్దతుగా మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న దీక్షకు దిగారు. ఈ సంద‌ర్భంగా వైకాపా ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. 

About Author