NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆమెను నేను అక్కలా భావిస్తా !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స‌మంత‌ను తాను అక్కలా భావిస్తాన‌ని, జీజీ (హిందీలో అక్క అని అర్థం) అని పిలుస్తాన‌ని ప్రీత‌మ్ జుక‌ల్కర్ వెల్లడించారు. అలాంటిది త‌మ మ‌ధ్య ఏదో ఉంద‌ని ఎలా మాట్లాడుతార‌ని ప్రశ్నించారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడారు. నాగ‌చైత‌న్యతో త‌న‌కు ఎన్నో ఏళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంద‌ని చెప్పారు. త‌న‌కు, స‌మంత‌కు మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటో నాగ‌చైత‌న్యకు తెలుసన్నారు. ప్రస్తుత ప‌రిణామాల‌పై చైత‌న్య స్పందించాల‌ని ప్రీత‌మ్ కోరారు. చైతన్య స్పందిస్తేనే ఇలాంటి పుకార్లకు తెర‌ప‌డుతుంద‌న్నారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతున్నట్టు సోష‌ల్ మీడియాలో ప్రక‌టించ‌గానే.. త‌న‌ను తిడుతూ మెసేజ్ లు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఎంతో మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యాన‌ని అన్నారు.

About Author