మోక్ష నారాయణ స్వామి ఆలయం దర్శించడం నా అదృష్టం
1 min read– రాజంపేట టీడీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : మోక్ష నారాయణ స్వామి ఆలయం దర్శించడం నా అదృష్టమని తెలుగు దేశం పార్టీ రాజంపేట ఇంచార్జీ బఠ్యాల చెంగల్ రాయలు అన్నారు.కమలాపురం మండలం రామాపురం పుణ్య క్షేత్రం లోని మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సంధర్భంగా శనివారం నాడు అయన ఆలయానికి విచ్చేసి ఉత్సవ పూజలో పాల్గొన్నారు. దర్భంగా ఆలయానికి విచ్చేసిన చంగల్రాయులకు ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆద్వర్యంలో వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా ఆలయ దేవతా మూర్తుల చరిత్ర గురించి అర్చకులు జగదీశ్ శర్మ, ప్రదీప్ శర్మ ఆయనకు వివరించారు. ఎంతో పురాతన కాలం నాటి దేవతా మూర్తులను పునః ప్రతిష్ట చేసి హరిహరాదులకు ఒకే వేదికపై నిత్య కళ్యాణం నిత్య అన్నదానం నిత్య గోసేవ నిర్వహించడం చాలా గొప్ప ఆధ్యాత్మిక సేవ గా ఆయన పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్య కళ్యాణం నిర్వహించడం ప్రపంచంలో ఇక్కడ మాత్రమే జరుగుతోందన్నారు ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంచితే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. ఆయన వెంట తెలుగు దేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు తాడిగొట్లవాసు, తదితరులు పాల్గొన్నారు.