PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీఓ నంబర్ 1 ను  కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నాను

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక పాలన మరియు దుర్మార్గమైన పాలన ప్రజలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు మరియు ప్రతిపక్షాలు ఎక్కడ వ్యతిరేకించి ధర్నాలు నిరసనలు చేపట్టతారో అన్న భయంతో జీవో నెంబర్ 1 ను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకొని వచ్చారు. జీవో నెంబర్ ఒకటిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులలో భాగంగా ప్రజలు & ప్రతిపక్షాలు నిరసన తెలిపేందుకు ర్యాలీలు & సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని లేకుండా చేశారునేడు జీవో నంబర్ 1 ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టులాంటిది.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. కరెంట్ చార్జీలు , బస్ చార్జీలు లాంటి వాటిపై ప్రజలు నిరసన తెలిపే అవకాశాన్ని ప్రజలకు లేకుండా చేశారు.ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షాలకు & ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భాగంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాను.

About Author