కుట్రదారులను కనిపెట్టడానికే బయటికొచ్చాను : శశికళ
1 min readపల్లెవెలుగు వెబ్ : రాజకీయ కుట్రదారులను కనిపెట్టడానికే గతంలో జయలలిత నుంచి విడిపోయినట్టు ఆమె స్నేహితురాలు శశికళ తెలిపారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 2011లో పోయెస్ గార్డెన్ వదిలిన ఘటనపై మాట్లాడుతూ.. అంతకు నాలుగు నెలల ముందే తనకు అలాంటి పరిస్థితి వస్తుందని తెలుసని, జయలలితకు తనకు మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర జరుగుతుందన్న సమాచారం తెలుసన్నారు. కుట్రదారులెవరో తెలుసుకోవాలని జయలలిత ఆకాంక్షించారని, దాంతో పథకం ప్రకారమే తాను బయటికి వచ్చినట్టు తెలిపారు. జయ తనకు ఓ ఫోన్ ఇచ్చి తరచూ మాట్లాడేవారని శశికళ చెప్పుకొచ్చారు. ఇటీవల రాజకీయాలకు దూరం అవుతున్నానని చెప్పిన శశికళ.. ఆ తర్వాత అన్నాడీఎంకే హస్తగతం చేసుకునే ప్రయత్నం దిశగా ఆ పార్టీ నిర్వహకులతో ఆమె ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి.