నేను ఎప్పటికీ వైఎస్ జగన్ విధేయుడినే..!
1 min read– శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
– మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: గతంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారంటూ జోరుగా ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై బైరెడ్డి మరోసారి స్పందించారు. నాలుగు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తనపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. గతంలో జరిగిన పరిణామాలపై వివరించే ప్రయత్నం చేశారు. 2009, 2014 నాటి పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల తాను టీడీపీలో చేరేందుకు కాళ్లు పట్టుకున్నానంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.వైఎస్సార్‌సీపీ యువనేత, ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరడానికి ప్రయత్నంచారనే ఊహాగానాలు వినిపించాయి. ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసినట్లు ప్రచారం జరిగింది. అప్పుడే బైరెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బైరెడ్డి సీనియర్ జర్నలిస్ట్ జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నం జరిగిందనే ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన పరిణామాలను వివరించారు. తాను 2019 ఎన్నికలకు ముందు 4,5 ఏళ్లు ముందు టీడీపీలో చేరాలని ప్రయత్నం చేశాను అన్నారు బైరెడ్డి. కానీ కుదరలేదు.. చేరలేదు.. అందులో ఏముంది అన్నారు. కొంతమంది తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేశానని.. ఎవరో కాళ్లు పట్టుకున్నానని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఓ పార్టీలో చేరాలనుకోవడం కాళ్లు పట్టుకోవడం అయితే 2009, 2014 లో కడప అసెంబ్లీ స్థానానికి బైరెడ్డి తల్లి డా.ఉషారాణి టీడీపీ నుంచి పోటీ చేయాలని తన తల్లి దగ్గరకు ఎంతమంది నాయకుల్ని పంపించారో వెళ్లి టిడిపి నేత చంద్రబాబు నాయుడు ను అడాలన్నారు. కొంతమంది తనను పిల్లాడు అనడం వల్ల వాళ్లకు వచ్చే లాభం ఏమీ లేదని.. తాను వాళ్లు ముసలోళ్లు అనడం వల్ల తనకు వచ్చే లాభం ఏం లేదన్నారు. అలాంటి వాటిని తాను పట్టించుకోను అన్నారు. ఇదిలా ఉంటే బైరెడ్డి తల్లి ఉషారాణిరెడ్డి కడపలో డాక్టర్‌గా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వైఎస్సార్‌సీపీ ని బైరెడ్డి వీడతారని జోరుగా ప్రచారం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో భేటీ అయినట్లు అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదన.. తాను నారా లోకేష్‌ను కలిసినట్లు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. వైఎస్సార్‌సీపీ తమదని.. తాను పార్టీకి వీర సైనికుడిని ఉంటానన్నారు. తాను ఎప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విధేయుడినే అని తేల్చి చెప్పారు.సోషల్ మీడియాతో పాటూ.. కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు బైరెడ్డి. అధినేత జగన్ తనకు శాప్ ఛైర్మన్, నందికొట్కూరు పార్టీ బాధ్యతలు ఇచ్చారని గుర్తు చేశారు. తాను పార్టీలో ఇంత చేస్తే తాను ఎందుకు వీడుతానని ప్రశ్నించారు. ఇప్పటికైనా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో కూడా విభేదాలు ఉన్నట్లు ప్రచారం అలాంటిది ఏమీ లేదన్నారు. తాజాగా టీడీపీ విషయంలో జరిగిన ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.