NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిజాయితీగా మీ సమస్యల పరిష్కారానికి నేను ముందుంటా

1 min read

– డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో నెహ్రూ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సమావేశం నెహ్రూ పాఠశాలల కరస్పాండెంట్ కమల్ తేజ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చా మల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ విద్యావ్యవస్థలోను ఉపాధ్యాయుల సమస్యల్లోనూ ముందుండి పోరాటానికి నిజాయితీగా మీ ముందుకు వచ్చాను మీరు నన్ను గెలిపించండి .నేను మీ సమస్యల్ని తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అబద్ధపు హామీలు ఇచ్చి మిమ్మల్ని నేను మోసం చేయలేను నిజాయితీగా నిబద్ధతతో సమస్యల సాధనకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. మీరందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి ఆయన నాకు వేసి గెలిపిస్తారని కోరుచున్నాను. డాక్టర్ గా అత్యున్నత విద్యావంతునిగా ,ప్రపంచంలో మేధావిగా గుర్తింపు పొందిన నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కారణం ఉన్నత విద్యావంతులు మండలి లోకి వెళితే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మీ ముందుకు వచ్చాను . అంతేకాదు భవిష్యత్తులో నన్ను అనుసరించి అనేకమంది విద్యావంతులు శాసనమండలిలో ప్రవేశించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ముందుకు వస్తారని తెలిపారు . కనుక మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి పేరు ఎదురుగా 1 అనే నంబర్ వేస్తూ ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి మాధవస్వామి బనగానపల్లె మండలం అధ్యక్షులు జె. వెంకట కృష్ణుడు, నాయకులు అనిల్ కుమార్ ,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author