PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాతలు ముత్తాతల పేరు చెప్పి రాజకీయాలు చేయను

1 min read

– పాతపేట యువకులను జీవితంలో మరవను
– నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలే నా బలం
– మీ ప్రేమ ఆప్యాయతలు నాకు కొండంత ఊపిరి
– వైసీపీ ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా
– జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలు ట్రైలర్ మాత్రమే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : తాతలు ముత్తాతల పేరు చెప్పి రాజకీయాలు చేయడం నాకు నచ్చదని వారి తరం వేరు ఇప్పటి తరం వేరని నియోజకవర్గ పార్టీ నేతలను ఉద్దేశించి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. నందికొట్కూరు పట్టణంలో నిర్వహిస్తున్న జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలు ముగింపు సందర్భంగా కమిటీ సభ్యులు శనివారం విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దార్థ రెడ్డి హాజరయ్యారు.వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో నందికొట్కూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు అండదండలు నాకు ఉన్నంత వరకు నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరేపలాడుతుందన్నారు. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకు కొండంత బలం ఇచ్చిన పాత పేట కౌన్సిలరు నాయబ్ వారి అనుచరులు యువకులను జీవితాంతం మరవను అని ఉద్వేగానికి గురయ్యారు.వైసీపీ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా.. మీ ప్రేమ ఆప్యాయతలు నాకు ఉన్నంత వరకు నా ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. పాత తరం పోవాలి కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమీపిస్తున్నాయి.. ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయి.. ప్రస్తుతం నందికొట్కూరు లో నిర్వహించిన జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలు ట్రైలర్ మాత్రమే ..మునుముందు సిద్దార్థ సినిమా ఉంటుంది అని కార్యకర్తలలో ఉత్సాహం నిలిపారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదనీ పార్టీ యువత అంతా సీఎం జగన్ కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని మీడియాలను వాడుకున్నా ప్రైవేట్ సైన్యమే ఆయన్ను కాపాడుకుంటుందన్నారు. సీఎం జగన్ మావాడు అని ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారనీ సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళి కృషా రెడ్డి, జడ్పీటీసీ కలిమున్నిసా, పోచ జగదీశ్వర రెడ్డి ,వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చిన్న మల్లారెడ్డి, కౌన్సిలర్లు మందాడి వాణి, నాయబ్, లాల్ ప్రసాద్ , అబ్దుల్ రావుఫ్, చాంద్ బాష, అబ్దుల్ హమీద్ మియ్య, వైసీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి, ఉస్మాన్ బేగ్ , పబ్బతి రవికుమార్ , రవీంద్ర రెడ్డి, రమేష్, మధు, కమిటీ సభ్యులు శాప్ కో ఆర్డినేటర్లు రవికుమార్, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

About Author