83 వేల కోట్ల పన్ను చెల్లిస్తాను.. ఎలన్ మస్క్ ప్రకటన !
1 min readపల్లెవెలుగువెబ్ : టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది తాను 83 వేల కోట్ల పన్ను చెల్లిస్తానంటూ ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఎవరూ కట్టనంత పన్ను తాను చెల్లిస్తానంటూ ఇటీవల ప్రతిజ్ఞ చేసిన ఎలన్ మస్క్ .. తాను చెల్లించబోయే పన్ను గురంచి చెప్పుకొచ్చారు. ఇటీవల టైమ్స్ మేగజైన్ ఈ ఏడాది మేటి వ్యక్తి
గా ప్రకటించింది. ఈ కథనం పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిజిబెత్ వారెన్ మండిపడ్డారు. ఈ మేటి వ్యక్తి ఒక్క పైసా కూడ పన్ను చెల్లించలేదని మండిపడ్డారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఎలన్ మస్క్ అమెరికాలో ఎవరూ కట్టనంత పన్ను తాను చెల్లిస్తానంటూ శపథం చేశారు.