PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఏఎస్ అధికారుల‌కు జైలు శిక్ష !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. ఈరోజు జరిగిన‌ విచారణకు అధికారులు ఇద్దరూ వ్యక్తిగతంగ హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై న్యాయ‌స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులను అమ‌లు చేయ‌నందుకు ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది.

About Author