ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు.. భారీగా పెరిగిన లాభం
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 59.4 శాతం మేర నికర లాభాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఆర్జించింది. సుమారు రూ. 7,018.7 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు గడించింది. అంతకుమందు ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు రూ. 4403 కోట్లు. నికర వడ్డీ ఆదాయం కూడా 21 శాతం మేర పెరిగి రూ. 12,605 కోట్ల రూపాయలుగా నమోదైంది.