ఐకానిక్ ఇండియా అందాల పోటీలు.. విజేతగా తెలుగమ్మాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నటి నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్‌గా నట్టి కరుణ విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ.. తమ సొంత బ్యానర్లో నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే నటన పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా హీరోయిన్‌గానూ కొన్ని చిత్రాలలో నటించారు. ఆమె తొలి ప్రయత్నంగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ‘డిఎస్‌జె’ (దయ్యంతో సహజీవనం) చిత్రం ఇటీవల విడుదలై, నటిగా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది.