NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇడా చైర్మన్ ని మర్యాదపూర్వకంగ కలిసిన  కో-ఆప్షన్ సభ్యురాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరుఅర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బోద్దాని శ్రీనివాస్ ని. ఏలూరు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యులు నీత విజయకుమార్ జైన్ దంపతులు గురువారం బోద్దాని కార్యాలయ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి మనోభావాన్ని    మా అన్నయ్య బోద్దాని    ప్రజా సేవకుడు, నిరంతర పార్టీ శ్రామికుడు అహర్నిశలు పార్టీ గురించి శ్రమించే వ్యక్తి, మంచి మనిషి పేదల పెన్నిధి, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలు తీర్చే మనసున్న మారాజు, అన్నయ్య బోద్దాని ఇడా చైర్ పర్సన్ గా  ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇవే మా హృదయపూర్వక అభినందన జ్ఞాపిక అంటూ జైన్ దంపతులు వారి మనసులో భావాన్ని వ్యక్తపరుస్తూ శాలువా కప్పి పుష్ప గుచ్చి అందించి జ్ఞాపికను అందజేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

About Author