స్టార్ట్ అప్ లక్ష్యంగా ఐడియా తాన్ 2025
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక వెంకాయపల్లెలోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కాలేజి మరియు జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ లు సంయుక్తంగా బిజినెస్ ఐడియా తాన్ 2025 ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ శ్రీ జీ.వీ.ఎం. మోహన్ కుమార్ ,. అతిధిగా డాక్టర్ మురళీధర్ రెడ్డి (ప్రొఫెసర్ కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,బెంగళూరు), హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్స్ గా ప్రిన్సిపల్స్ డాక్టర్. కె.ఈ శ్రీనివాసమూర్తి మరియు డాక్టర్ సి. శ్రీనివాసరావు లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఐడియా తాన్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం స్టార్ట్ అప్ ను ప్రోత్సహించడమని తెలుపుతూ,విద్యార్థులు నూతన మరియు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వస్తే కాలేజీ యాజమాన్యం అందులో పెట్టుబడి పెట్టడానికి ముందుంటామని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సృజనాత్మకశక్తిని వెలికితీస్తూ ,వారిలో ఉన్న కొత్త ఆలోచనలకు పుణాదులు వేయడానికి తోడ్పటతాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చిన కళాశాల ప్రిన్సిపల్ లను మరియు కన్వీనర్ డా.సి.రంజిత్ కుమార్ ను ఛైర్మన్ అభినందించారు. అతిధి డాక్టర్ వై మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం లాభాలు అని, విద్యార్థుల యొక్క ఆలోచనలు మరియు ఆవిష్కరణలు లాభాలు తెచ్చేవిధంగా ఉండాలని తెలియజేశారు. ఏ కంపెనీ అయినా తాను ఆర్థికంగా నిలదొక్కుకోగలిగినప్పుడే ఇతర ఉద్యోగులను ఎక్కువగా చేర్చుకోవడానికి ముందుకు వస్తుందన్నారు. మీ ఆలోచనలు మీ ఎదుగుదలతో పాటు ,కంపెనీ,సంస్థల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడాలన్నారు.ఈ కార్యక్రమములో కళాశాలల వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
