NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 28, 29 తేదీలలో ఐడియల్ యూత్ మహాసభ

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఐడియల్ యూత్ మహాసభను ఈనెల 28, 29 తేదీల్లో కుమ్మరిపాలెం లోని ఈద్గాహ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నామని ఐవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలిముల్లాఖాన్ తెలిపారు.ఐడియల్ యూత్ మూవెమెంట్ ఆంధ్రప్రదేశ్ గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలిముల్లాఖాన్ మాట్లాడుతూ ఐడియల్ యూత్ మూవెమెంట్ ఒక సామాజిక, సైద్ధాంతిక యువగళం అన్నారు.దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా యువకులలో సామాజిక రుగ్మతలను దూరం చేసి నైతిక మార్పుకు కొరకు గత పది సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్నా సంస్థ ఐవైయం అని, వారిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే ఐవైయం లక్ష్యం అని తెలిపారు. ఐవైయం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ విశ్వాసు, ప్రగతి, ఆత్మగౌరవం నినాదాలతో రెండు రోజుల రాష్ట్ర మహాసభను నిర్వహిస్తుందన్నారు. ఈ సభల ద్వారా ముస్లిం యువతలో ధార్మికతను జనింపజేసి విద్యా, ఆర్దిక, సామాజిక రంగాల్లో ప్రగతిపథంలో నడిపించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సమాజంలోని సామాజిక రుగ్మతలను దూరం చేసి మంచి సమాజ నిర్మాణానికి ఐవైఎమ్ యువత నాంది పలుకుతుందని తద్వారా యువకుల్లో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడానికి అవిరళకృషిని ఐవైఎమ్ చేస్తుందని ఇబ్రహీం అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాజ బాబా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్సర్, విజయవాడ నగర అధ్యక్షులు రిజ్వాన్, కార్యదర్శి మతన్, గపూర్, జాకీర్, మునీర్ సభ్యులు పాల్గొన్నారు.

About Author