భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గుర్తింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ లో మరో సబ్ వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. బీఎఫ్.7 గా పిలుస్తున్న ఈ వేరియంట్ చైనాలోని మంగోలియా ప్రాంతంలో మొదలైందని.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన రోగ నిరోధక శక్తిని, వ్యాక్సిన్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తోందని పేర్కొంటున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని.. కానీ వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు.